
హిందువులంతా గోమాతగా పూజిస్తూ ఉంటారు. ఇది హిందూ సంస్కృతిలో భాగం. గోమాతకు ఆహారం అందిస్తూ ఉంటాం. అయితే దీని వెనుక సంప్రదాయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలున్నాయి. ఇది నేటి సంప్రదాయం కాదు.. శతాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే ఆవుకు ఆహారం అందిస్తే కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయని శాస్త్రం చెబుతోంది. ఆవులో ముక్కోటి దేవతలు నివసిస్తారని నమ్మకం. కాబట్టి ఆవుకు ఆహారం అందిస్తే ముక్కోటి దేవతలకు ఆహారం అందించినట్టేనని చెబుతారు. ఆహారం ఆవుకి అందించే వ్యక్తికి దేవుడికి ఆశీర్వాదం లభించినట్టేనని చెబుతారు.
ఆవుకు బెల్లం కూడా తినిపిస్తారు. ఇలా చేస్తే యాగం చేసి దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుందట. అది మాత్రమే కాకుండా కొన్ని దోషాలున్న వారు సైతం ఆవుకు బెల్లం, మేత తినిపిస్తే మంచిదట. శనీశ్వరుడు, పితృ దోషాలతో బాధపడుతున్న వారైతే తప్పక ఇవి చేయాలట. ఆవుకు ఆహారం తినిపించడం వలన దోషాలన్నీ తొలగిపోవడమే కాకుండా మనకు జీవితో చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి ఆవులంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన గోపాలుడు అయ్యాడు. ఆవులను బాగా చూస్తే కన్నయ్య ఆశీర్వాదం కూడా లభిస్తుంది.
