Site icon Bhakthi TV

దీపాన్ని తూర్పు, ఉత్తరం వైపు పెడితే ఏం జరుగుతుందో తెలుసా?

హిందూమతంలో పూజ సమయంలో దీపారాధన తప్పనిసరిగా చేస్తారు. ఇక ఈ దీపం ఎలా పడితే అలా వెలిగించకూడదు. దీనికి కొన్ని నియమాలున్నాయి. అవేంటో చూద్దాం. పూజ లేదంటే ఏదైనా శుభకార్యం ఏం చేసినా కూడా భగవంతుడి ముందు దీపం వెలిగించడం ఆనవాయితీ. అయితే నియమానుసారంగా వెలిగిస్తే ఫలితం మరింత బాగుంటుంది. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందట. దీపం వెలిగించే సమయంలో వత్తి ఎప్పుడూ కూడా రెండు దిశల్లో మాత్రమే ఉండాలి. అవేంటంటే.. తూర్పు దిశ లేదంటే ఉత్తరం. పూజ చేసే సమయంలో దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిది.

వేరే నూనెలను కూడా ఉపయోగించవచ్చు కానీ ఆవు నెయ్యితో దీపం వెలిగించిన వెంటనే .. ఇతర నూనెలతో దీపాలను వెలిగించకూడదు. దీపాన్ని తూర్పు ముఖంగా ఉంచితే ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుందట. ఇక ఉత్తరం వైపు దీపాన్ని పెట్టడం వలన శ్రేయస్సు, జ్ఞానం పెరుగుతుందట. తద్వారా ఉన్నత స్థితికి వెళతామట. ఇక పడమర వైపు పెడితే జీవితంలో ఆటంకాలు ఎదురవడంతో పాటు మానసిక ఆందోళన పెరుగుతుందట. దీపాన్ని దక్షిణం వైపు ఉంచితే చిక్కుల్లో పడతామట. చేపట్టిన పనుల్లో అడ్డంకులు.. జీవితం సాఫీగా సాగదట. ఇక దీపాన్ని నూనెతో పెడితే ఎరుపు వత్తిని ఉపయోగించాలి.

Share this post with your friends
Exit mobile version