
పదమూడో శతాబ్దంలో జ్ఞానదేవ్ అనే ముని పిల్లల కోసం ఒక ఆట తయారు చేశారు. ఆ ఆట పేరు మోక్ష పదం. మన సంస్కృతిని, ఆచారాలను అన్నిటినీ నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న బ్రిటిష్ వారి కన్ను ఆటల్లో కూడా మనవారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు అని గ్రహించి ఆ ఆటని మొత్తం బ్రిటీష్ వారు మార్పు చేసి స్నేక్స్ అండ్ లాడర్స్‌గా విడుదల చేశారు. వారికి కలిసి వొచ్చిన అంశం అప్పటికి ముద్రణా వ్యవస్థ అందుబాటులోకి రావడం. అలా మోక్ష పదం కాస్తా వైకుంఠపాళిగా రూపాంతరం చెందింది.
పాత కొత్త ఆటలో వంద చతురస్రములు ఉంటాయి. అయితే మునీశ్వరుడు రూపొందించిన ఆటకు.. బ్రిటీష్‌వారు తీసుకొచ్చిన ఆటకు కొంత తేడా అయితే ఉంది. అదేంటో తరువాత తెలుసుకుందాం.ఆటలోనే మంచి, చెడు నేర్చుకోవాలి అని ముని జ్ఞానదేవ్ చెప్పకుండానే పిల్లలకు తెలుస్తుంది. చెడు మార్గన్ని ఎంచుకునే వారు అధం పాతాళానికి చేరుకుంటారనేది ఆయన సారాంశం. అలాగే మంచి గుణాలు అలవర్చుకుంటే జీవితంలో పైకి ఎదుగుతాము అని ఆటలో కూడా చెప్పడం. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండానే పిల్లలు ఆడేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఆట కూడా దాదాపుగా కనుమరుగైందనే చెప్పాలి.
