Site icon Bhakthi TV

అష్టైశ్వర్యాలు అంటే ఏమిటో తెలుసా?

పిల్లలను ఆశీర్వదించేటప్పుడు పెద్దలు ‘అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు’ అని దీవించడం వింటూనే ఉంటాం. అది మాత్రమే కాదు.. చాలా సందర్భాల్లో అష్టైశ్వర్యాలు అనే మాట వింటుంటాం. ఐశ్వర్యం అంటే సంపద. అష్ట అంటే ఎనిమిది. ఎనిమిది ఐశ్వర్యాలు ఏంటి? ఐశ్వర్యం అనేది ఒక్కటే కదా.. అనే ఆలోచన రావొచ్చు. వాస్తవానికి ఐశ్వర్యం ఉన్న చోట దేనికీ ఎలాంటి లోటు ఉండదు. అయితే ఆ ఐశ్వర్యం ఒక్కటే ఉంటే మనిషి గొప్పవాడు కాలేడు. అవి కేవలం ఐహిక భోగాలు మాత్రమే.

ఒక వ్యక్తికి సంఘంలో నిజమైన పేరు, ఆనందమయ జీవితం కలిగేది అతనికి అష్టైశ్వర్యాలు సిద్ధించినప్పుడే. మరి అంతటి ప్రాముఖ్యం ఉన్న అష్టైశ్వర్యాలు ఏంటో మీరే చదవండి. అష్టైశ్వర్యాలు అంటే.. రాజ్యం, ధనం, ఇల్లాలు, సంతానం, ధైర్యం, ఆత్మస్థైర్యం, విద్య, వినయంలను అష్టైశ్వర్యాలు అంటారు. రాజ్యమంటే ఒకరి ఆధీనంలో ఉన్న ప్రాంతం కాదు. ఈ భూమండలంపై వ్యక్తి పేరు, యశస్సు, కీర్తి ఎంతవరకు విస్తరిస్తే ఆ ప్రాంతమంతా అతని రాజ్యమని అర్థం. ఈ రాజ్యమే అతనికి రాజసం తెచ్చి పెడు తుంది. అంటే మనిషి గొప్ప తనం నలుమూలలా విస్తరిస్తే అది తనకు కలిగిన ఒక ఐశ్వర్యమన్నమాట.

Share this post with your friends
Exit mobile version