Site icon Bhakthi TV

కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎలాంటి పరిస్థితుల్లో నిర్మించారో తెలుసా?

కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఎప్పుడు నిర్మించారనే విషయాలు చాలా మందికి తెలియవు. కేదార్‌నాథ్ ఆలయం బహుశా 8వ శతాబ్దంలో నిర్మించబడిందనిశాస్త్రం చెబుతోంది. అంటే ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల నుంచి ఉంది. కేదార్‌నాథ్ ఉన్న భూమి అప్పుడే కాదు ఇప్పటికీ 21వ శతాబ్దంలో కూడా చాలా ప్రతికూలమైనది. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్‌నాథ్ కొండ, మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్‌కుండ్, మూడో వైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్‌కుండ్ ఉన్నాయి.

ఈ మూడు పర్వతాల గుండా ప్రవహించే ఐదు నదులు మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి, స్వరందరి. వీటిలో కొన్ని పురాణాలలో రాయబడ్డాయి.
ఈ ప్రాంతం మందాకినీ నది ప్రారంభంలో ఉంటుంది. చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు, వర్షాకాలంలో నీరు అతి వేగంతో ప్రవహించే ప్రదేశం, ఇలాంటి ప్రదేశంలో ఇంతటి కళాఖండాన్ని రూపొందించడం ఎంతో ప్రయాసతో కూడిన అద్భుతమైన విషయం. నేటికీ కేదార్‌నాథ్ ఆలయం ఉన్న ప్రదేశానికి వాహనాలతో వెళ్లలేరు. 1000 సంవత్సరాల క్రితం ఇంత ప్రతికూల ప్రాంతంలో, ఏమాత్రం అనుకూలించని పరిస్థితుల నడుమ ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారనేది ఇప్పటికీ ఆసక్తికరమే.

Share this post with your friends
Exit mobile version