Site icon Bhakthi TV

పూరి జగన్నాథుని ఆలయానికి సంబంధించిన బంధు మహంతి కథ తెలుసా?

బంధు మహంతికి భార్య, ఇద్దరు మగపిల్లలు. భోజనం చేయక రెండు రోజులు అయ్యింది. వర్షాలు లేక, కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒడిషాలోని కటక్, బాలాసోర్ మధ్య ఉన్న జాజ్పూర్‌లో భిక్షమెత్తుకొని, వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను, తన భార్య ఇంకా మిగిలి ఉన్న చెట్ల ఆకులు తింటూ బంధు మహంతి బతుకుతున్నాడు. భార్య కంట తడిపెట్టినప్పుడల్లా.. “ఏడవకు. నాకు పురి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు. చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు. మనకూ అతను సహాయం చేస్తాడులే” అని బంధు చెప్పేవాడు.

ఒకరోజు భార్య ‘మనం మీ స్నేహితుడి దగ్గరికెళ్ళి మన దీనావస్థను చెప్పుకొందాం. ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు’ అని చెప్పింది. దీంతో బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకొని 144 కి.మీ. దూరంలో ఉన్న పురి నగరానికి బయలుదేరాడు. మధ్య దారిలో అడవి వస్తుంది.

1530 వ సంవత్సరంలో నాలుగురోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పురి నగరం చేరాడు. రాత్రి అయ్యింది. “ఇపుడు నా స్నేహితుడు నిద్ర పోతుంటాడు. నిద్రా భంగం చేయడం మంచిది కాదు. ఉదయం ఆయన ఇంటికి వెళదాం” అన్నాడు బంధు. ఆమె సరే అన్నది. అలాగే పిల్లలకు తినడానికేం లేదని.. వాళ్లు ఆకలికి ఏడుస్తున్నారని చెప్పింది. అప్పుడు బంధు.. ‘మనం ఇపుడు పురి జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాం. గుడి తలుపులు మూసేశారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం’ అంటూ భార్యా పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు. తన బాధంతా చెప్పుకుని తన పిల్లలకు ఆహారం కోసం స్వామివారిని అత్థించాడు. మధ్య రాత్రి బ్రాహ్మణ రూపంలో జగన్నాథుడే స్వయంగా వచ్చి ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకుని భర్తాపిల్లలకు ఆహారం పెట్టింది.

Share this post with your friends
Exit mobile version