Site icon Bhakthi TV

బీదర్‌లో శ్రీ క్షేత్ర గుప్త లింగేశ్వరాలయంలోని అద్భుతం ఏంటో తెలుసా?

భారతదేశంలో ఆలయాలకు కొదువ లేదు. వీటిలో కొన్ని అద్భుతాలకు నెలవు. సైన్స్‌ కూడా ఛేదించలేని రహస్యాలు చాలా ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని భాల్కీ తాలూకాలోని ఖానాపూర్ గ్రామ సమీపంలో కొండ మధ్యలో ఉంది. ఇది శివాలయం. దీనిని శ్రీ క్షేత్ర గుప్తలింగేశ్వరాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం ఐదు లేదా ఆరు శతాబ్దాల నాటిది కావడం విశేషం. ఈ ఆలయంలో అద్భుతాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడి నీటిని ఔషధంలా భక్తులు తీసుకుంటూ ఉంటారు. ఈ నీటిని తాగితే అన్ని రకాల వ్యాధులు నయమవుతాయని నమ్మకం.

వాస్తవానికి బీదర్‌ జిల్లాలో వేసవిడి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. బావులు, చెరువులు అన్నింటిలోనూ నీరు ఎండిపోతుంది. కానీ సుక్షేత్ర గయముఖ గుప్తలింగేశ్వరాలయంలోని కొండలో మాత్రం నీరు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి నేటి వరకూ ఏ సీజన్‌లోనూ నీటి ప్రవాహం మాత్రం ఆగలేదట. అసలు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనే విషయం కూడా ఎవరికీ తెలియదట. ఈ నీటిలో స్నానం చేస్తే రోగాలన్నీ మాయమవుతాయట. ఈ గుప్త లింగ దేవాలయం చుట్టూ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అలాగే గుహలోని శివలింగం నుంచి కూడా నీరు నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు.

Share this post with your friends
Exit mobile version