Site icon Bhakthi TV

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వెంకటేశ్వరస్వామి విగ్రహం ఏ దేశంలో ఉందో తెలుసా?

మన దేశంలో హిందూ దేవాలయాలు ఉండటం సర్వసాధారణం. కానీ విదేశీ గడ్డపై ఉంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో కదా. మారిషస్ నడిబొడ్డున ఒక అద్భుతమైన హరి హర దేవస్థానం ఉంది. హరి (విష్ణుమూర్తి), హర (పరమేశ్వరుడు) కొలువైన ఈ ప్రదేశం మారిషస్‌లో ప్రధాన సాంస్కృతిక ఆకర్షణ మాత్రమే కాకుండా హిందూ సమాజానికి ప్రధాన ప్రార్థనా స్తలంగా కూడా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని బ్రిటీష్ పాలనా కాలంలో నిర్మించారు. మారిషస్ వాసులు తమ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవాలన్న ధృఢ సంకల్పంలో భాగంగానే అక్కడ ప్రార్థనా స్థలాలను నిర్మించారు.

ఈ ఆలయాన్ని 20వ శతాబ్దంలో నిర్మించారు. పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి స్థానికుల మద్దతుతో ఈ ఆలయాన్ని విస్తరించడంతో పునరుద్దరించారు. ఈ ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఈ ఆలయ ముఖ భాగం రంగు రంగు శిల్పాలతో చూడముచ్చటగా ఉంటుంది. ఆలయ గోపురం అత్యంత ఎత్తులో ఉంటుంది. ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆలయంలో ఒక్కో దేవత కొలువై ఉంటారు. ప్రధాన గోపురంలో హరి (విష్ణువు), హర (శివుడు) విగ్రహాలు ఉండగా.. మిగిలిన చోట్ల గణేశుడు, మురుగన్, లక్ష్మి, పార్వతి వంటి దేవతలు కొలువుదీరారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. దీని ఎత్తు 108 అడుగులు.

Share this post with your friends
Exit mobile version