Site icon Bhakthi TV

కలియుగ దైవం శ్రీనివాసుడి కల్యాణంలో వంటలెలా చేశారో తెలుసా?

కలియుగ దైవం శ్రీనివాసుడి కల్యాణం గురించి చదివితే కలియుగంలో మధ్యతరగతి కుటుంబాలలో వివాహం చెయ్యడం ఎంత కష్టమో తెలుస్తుంది. కుబేరుడు నుంచి అప్పు దొరికి, అన్నీ పెళ్లి సరుకులు తెచ్చాక ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు, వచ్చేవాడు మన ఇంటికి భోజనానికి లేక వస్తాడా? ఇప్పటికిప్పుడు ముహూర్తం పెట్టుకుంటే వంట బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడు? అనుకున్నారు. స్వామి అగ్నిహోత్రుని వంక చూస్తే “నేను చేస్తాను స్వామి !” అన్నాడు. కానీ వంటపాత్ర సామానులేవి? అన్నాడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడు, వంట చేయడానికి పాత్రలు కావాలనడంతో వేంకటాచలం మీదనున్న తీర్ధాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు.

నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వందల్లో వస్తే పెద్దపెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండమంతా దిగివస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి. పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్ధాలు తిరుమలలో కొలువై ఉన్నాయి. అగ్నిహోత్రుడు పాపనాశనంలో పైన చింతపండు పిసికి పోసేయండి . కింద నేను పులుసు చేసేస్తాను అన్నాడు . ఒక్కో తీర్ధంలో / సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు.

స్వామి పుష్కరిణిలో అన్నం, పాపనాశనంలో పప్పు, ఆకాశగంగలో బెల్లం పరమాన్నం, దేవతీర్థంలో కూరలు, తుంబురతీర్ధంలో పులిహోర, కుమార తీర్ధంలో భక్ష్యాలు (బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు వంటివి), పాండుతీర్ధంలో పులుసు, ఇతర తీర్ధాల్లో లేహ్యాలు మొదలైని తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపించాడట. ఇక అలన్నిటిలోనూ పప్పులు, పులుసులు , చక్కెర పొంగళ్లు , కట్టు పొంగళ్లు , జీలకర్ర పొంగళ్లు, ఎన్నో రకాల పొంగళ్ళు, పులిహోర పొంగళ్ళు చేశారు.

Share this post with your friends
Exit mobile version