Site icon Bhakthi TV

శివలింగాలు ఎన్ని రకాలుంటాయో తెలుసా?

శివలింగానికి మనం పూజలు చేస్తూ ఉంటాం కానీ అవి ఎన్ని రకాలు అనే విషయం మాత్రం దాదాపుగా ఎవరికీ తెలియదు. శివలింగాలు 5 రకాలుంటాయి. ఒక్కో శివలింగానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. శివలింగంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవత ఉంటుందని శివపురాణం వివరించింది. ఇప్పుడు శివలింగాల్లో రకాలు చూద్దాం.

1. స్వయంభువు లింగం: దేవతలు, ఋషులు ప్రార్ధించినప్పుడు శివుడు అనుగ్రహించి వెలిశాడు. కాబట్టి ఈ శివలింగాన్ని స్వయంభువు లింగమంటారు.

2. బిందు లింగం: యంత్రంలో చెక్కబడిన లింగాన్ని బిందులింగమని చెబుతారు.

3. ప్రతిష్ఠ లింగం (పౌరుషము) లింగం: దేవతల, గురువుల, మానవుల ఆధ్వర్యవంలో శిల్పి ద్వారా చేయించి మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించిన లింగం.

4. చర లింగం: పాదరసం, ఏదైనా లోహంతో చేసిన, మెడలో కట్టుకునేవి. ఈ చర లింగాలను గురువులు, భక్తులు ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్లి పూజించుకోవచ్చు.

5. గురు లింగం: నడుస్తున్న గురువే లింగం. ఈశ్వరుడే గురువు రూపంలో ఉంటాడు

కలియుగంలో ప్రతి ఒక్కరూ యథాశక్తి లింగం ప్రతిష్ఠించాలట. అలా ప్రతిష్టించేందుకు సాధ్యపడని వారు ప్రతిష్ఠ జరిగిన లింగానికి పూజలు జరగడానికి ధనం ఇస్తే మంచిదని చెబుతారు.

Share this post with your friends
Exit mobile version