Site icon Bhakthi TV

వజ్ర కవచ పూజ గురించి తెలుసా?

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఎటువంటి కష్టాలైనా తొలగుతాయని విశ్వాసం. అందుకే ఆయనను ఆపదమొక్కుల వాడని పిలుస్తారు. స్వామివారిని సేవించడానికి ఎన్నో పూజా విధానాలు ఉన్నాయి. వాటిలో విశిష్టమైనది.. వజ్ర కవచ పూజ. దీని గురించి చాలా మందికి తెలియదు. ఈ వజ్ర కవచ పూజను ఎన్నో గండాలు, ఆపదలు తొలగించేందుకు చేస్తూ ఉంటారు. పేరులోనే ఉందిగా వజ్ర కవచమని.. దీనిని చేస్తే సాక్షాత్తు ఆ మలయప్ప స్వామే మన ఇంటికి కవచంలా నిలబడతాడట. పురాణాలు సైతం ఈ పూజ గురించి చెబుతున్నాయి. ఈ వజ్ర కవచ పూజ విశేషాలేంటి? ఎప్పుడు నిర్వహించాలో తెలుసుకుందాం.

వజ్ర కవచ పూజ గురించి తెలుసా?

వజ్ర కవచ పూజను శనివారం మాత్రమే ఆచరించాల్సి ఉంటుంది. ఈ పూజతో శ్రీ వేంకటేశ్వర స్వామి మనకు రక్షణ కల్పిస్తాడు. సాధారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం ఏడు శనివారాల వ్రతం, పిండి దీపారాధన వంటి వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం. వీటి గురించి అందరికీ తెలుసు. వజ్ర కవచ పూజ గురించి పెద్దగా తెలియదు. ఈ పూజ అత్యంత శక్తివంతమైన పూజ. పూర్వం ఇంద్రుడు తన రక్షణ కోసం శ్రీ వేంకటేశ్వర స్వామిని వజ్ర కవచ స్తోత్రంతో స్తుతించాడని వరాహ పురాణం, స్కంద పురాణం లోని వెంకటాచల మహత్యం వంటి పురాణాలు చెబుతున్నాయి. ఈ పూజ చేయడం వలన మన జీవితంలోని సమస్యలతో పాటు కోర్టు గొడవలు ఏమైనా ఉన్నా.. శత్రు భయాలతో పాటు గ్రహ దోషాల నుంచి మనల్ని ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది.

Share this post with your friends
Exit mobile version