Site icon Bhakthi TV

ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమైన సీత గుణగణాల గురించి తెలుసా?

సీతాదేవి గుణగుణాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. స్త్రీ పాత్ర ‘సీత’ లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముడి జీవితాన్ని అసలు ఊహించలేము. కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో మహానుభావాలు, మేథావులు పరిశోధనలు కూడా చేశారు. సీతలోని సుగుణాలు నేటి మగువలకు ఎంతో ఆదర్శం. ఆమె చరితం ఓ స్ఫూర్తిదాయకమైన కథాసాగరం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగుణాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.

ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమైన సీత గుణగణాల గురించి తెలుసా?

ధర్మమూర్తి..
సీత ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గృహిణిగా మారిన మహాసాధ్వి ‘సీతాదేవీ’. రాముడు తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యవాసానికి వెళ్లినప్పడు తన భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది.

దయాశీలి..
పేదవారిని ఆదరించి అన్నం పెట్టాలన్న దయాగుణం గల స్త్రీమూర్తి సీత. అదే భావనతో తనింటికి మారువేషంలో బిక్షాటన వచ్చిన రావణుడికి లక్ష్మణరేఖ దాటి మరీ భిక్షం వేసిన దయామూర్తి ఆమె. తన రక్షణ కోసం పెట్టుకున్న నియమం కన్నా దానమే గొప్పదన్న నీతిని ఆమె ఈ సందర్భంలో వెల్లడిస్తున్నది.

ధైర్యశాలి..
పాతివ్రత్య నిరూపణ కోసం సీతను అగ్నిప్రవేశం చేయమని రాముడు అడిగినప్పుడు ధీరత్వంతో ఆ పనికి సిద్ధమైన ధైర్యశాలి సీత. రాముని మాటలు ఆమె గుండెను గాయపరిచినా సహనంతో భరించింది. తానే తప్పు చేయలేదన్న ఆమె ఆత్మవిశ్వాసం చివరికి నిందారోపణ చేసిన వారిని సైతం తలదించుకునేలా చేసింది.

Share this post with your friends
Exit mobile version