
తిరుమలలో చాలా మంది తులాభారం సమర్పిస్తామని శ్రీనివాసుడికి మొక్కుతారు. తమ కోరిక నెరవేరిన వెంటనే తులాభారం ఇస్తారు. స్వామి అనుగ్రహం పొందిన భక్తులు వారి బరువుకు లేదా వారి పిల్లల బరువుకు సమానమైన డబ్బు స్వామికి సమర్పించడమే తులాభారం. అవసరమైతే తిరుపతి తిరుమల దేవస్థానం వారు నాణేలను కూడా అందిస్తుంది. ఈ తులాభారం ద్వాపర యుగం నుంచి ఉంది. తులాభారంలో భక్తులు బియ్యం, పంచదార, బెల్లం, పటిక బెల్లం, నాణేలను సమర్పిస్తారు. వీటిని కూడా మనం డబ్బు చెల్లిస్తే తిరుమల తిరుపతి దేవస్థానమే సమకూరుస్తుంది.
గతంలో బరువుకు తగ్గ వస్తువును మోసుకుని వెళ్ళి సమర్పించేవారు. ఇప్పుడు తులాభారంలో కూర్చోబెట్టి కిలో చొప్పున ఆ వస్తువు రేటు చెల్లిస్తే మీకు రసీదు ఇస్తారు.అది హుండీలో వేస్తారు.
రూపాలు నాణేలు కేజీ – 202/-
రెండు రూపాయల నాణేలు కేజీ 332/-
ఐదు రూపాయల నాణేలు కేజీ 555/-
మిగిలినవి మార్కెట్ రేటును బట్టి మారుతూ ఉంటాయి. ఈ తులాభారం తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం నుండి లోపలకు వెళ్ళగానే ధ్వజస్తంభం ఎడమ చేతి వైపు ఉంటుంది. దీనికి ఎటువంటి టిక్కెట్ అవసరం లేదు. తులాభారం తరువాత మీరు దర్శనానికి వెళ్ళవచ్చు.
