Site icon Bhakthi TV

1500 కిలోల బంగారంతో రూపొందించిన ఆలయం గురించి తెలుసా?

అరుణాచలం వెళ్లేందుకు ముందుగా కంచికి వెళ్లి అక్కడి దేవాలయాలను దర్శించుకున్నాక.. అరుణాచలం బయలుదేరాలి. మధ్యలో శ్రీపురం ఉంటుంది. స్వర్ణదేవాలయం పేరు చెప్పగానే అందరికీ అమృత్‌సర్‌ స్ఫురిస్తుంది. అయితే దక్షిణాదిన ‘శ్రీపురం’ క్షేత్రానికి ఆ గుర్తింపు ఉంది. ఆలయ నిర్మాణంలో స్తంభాలు, శిల్పాలను మొదట రాగి తాపడం చేశారట. ఆ తర్వాత దానిపైబంగారు రేకుల్ని తొమ్మిది పొరల్లో వేసి అందంగా తీర్చి దిద్దారు. 1500 కిలోల బంగారంతో సుమారు 400 మంది శిల్పుల ఆరేళ్ల శ్రమ ఫలితంగా ఈ బంగారు ఆలయం రూపుదిద్దుకుంది.

మొదట్లో దీనిని ‘తిరుమలైకోడి’గా పిలిచేవారు. మహాలక్ష్మి ఆలయం నిర్మించిన తర్వాత ‘శ్రీపురం’గా మార్చారట. ప్రధాన గర్భగుడిని చేరుకోవాలంటే దాదాపు కిలోమీటరు దూరమున్న నక్షత్రపు ఆకారంలోని మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గం పొడవునా రెండు వైపులా ఉండే గోడలపై భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌లోని ప్రవచనాలను చూడవచ్చు. (ఈ ప్రవచనాల పుస్తకం.. ఆలయ పుస్తక దుకాణంలో సైతం లభ్యమవుతుంది). వీటిని చదవడం వల్ల భక్తులు అజ్ఞానపు ఆలోచనలను వీడి, జ్ఞాన సుగంధంతో బయటకు వెళ్తారని అంటారు. ఈ రెండు ఆలయాలను దర్శించుకుని తరువాత అరుణాచలం వెళ్లాలి.

Share this post with your friends
Exit mobile version