Site icon Bhakthi TV

వ్యక్తి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే నంబర్ గురించి తెలుసా?

చాలా మందికి లక్కీ నంబర్స్ ఉంటాయి. లక్కీ నంబర్ అనేది వ్యక్తి వ్యక్తిత్వాన్ని, విధి, జీవిత ప్రయాణాన్ని డిసైడ్ చేస్తుందట. అలాగే ప్రతీ సంఖ్యకు ఏదో ఒక ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఈ క్రమంలోనే సంఖ్యాశాస్త్రంలో 8 నంబర్‌కు సైతం ఓ ప్రాధాన్యత ఉంది. ఈ నంబర్ ముఖ్యంగా శనీశ్వరుడికి నేరుగా సంబంధించినది.
ఈ సంఖ్య శక్తికి, సమతుల్యతకు, కర్మకు ప్రతీక అని చెబుతారు. కాబట్టి ఈ 8వ సంఖ్య కలిగిన వ్యక్తులు కష్టపడి పని చేసే తత్వంతో పాటు ధృడ సంకల్పం, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు జీవితంలో సవాళ్లను సైతం ఎదుర్కొంటారట.

సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ఏదైనా నెలలో 8, 17 లేదా 26 తేదీలలో జన్మించిన వారి మూల సంఖ్య 8. దీని ఆకారం ఇన్ఫినిటివ్ అంటే అనంతం సింబల్‌ను పోలి ఉండటం వలన ఆధ్యాత్మక, భౌతిక ప్రపంచాల మధ్య సమతుల్యతను తెలియజేస్తుంది. ఈ సంఖ్య బలం, సమతుల్యత, సమృద్ధికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దీని ఆకారం అనంత చిహ్నాన్ని పోలి ఉంటుంది. ఈ సంఖ్య కలిగిన వాళ్లు జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ వ్యక్తులకు సహనం, పట్టుదల ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలరు. వీరి పనులను బట్టే విజయం లేదంటే వైఫల్యాలు ఆధారపడి ఉంటాయి.

Share this post with your friends
Exit mobile version