Site icon Bhakthi TV

సిరిమానోత్సవంలో కీలక ఘట్టాల గురించి తెలుసా?

ఏడాదిలో ఒకసారి దసరా పండుగ తర్వాత వచ్చే మంగళవారం రోజున విజయనగరంలోని పైడితల్లి అమ్మవారికి సిరిమాను జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సిరిమానోత్సవంలో చాలా కీలక ఘట్టాలున్నాయి. సెప్టెంబర్ 20న భాద్రపద బహుళ తదియ రోజున మండల దీక్షతో ఈ జాత ప్రారంభమైంది. ఈ జాతరలో అమ్మవారికి పండుగ రాట వేసి ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభించారు. ఇక అక్టోబర్ 14న అంటే నేడు విజయనగరంలో అమ్మవారి తొల్లెళ్ల ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

ప్రధాన ఘట్టమైన సిరిమాను ఉత్సవాన్ని అక్టోబర్ 15న జరగనుంది. ఆ తరువాత అక్టోబర్ 22వ తేదీ మంగళవారం పెద్ద చెరువులో అమ్మవారి తెప్పోత్సవం, 27న సాయంత్రం కలశ జ్యోతుల ఊరేగింపు వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అక్టోబర్ 29న మంగళవారం చదురుగుడి వద్ద ఉయ్యాల కంబాల మహోత్సవం, 30న బుధవారం వనం గుడి ఆవరణలో చండీహోమం, పూర్ణాహుతి, దీక్షా విరమణ కార్యక్రమాలతో ఈ ఏడాదికి పండుగ ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ ఉత్సవాలన్నింటిలో సిరిమానోత్సవమే కీలకం. ఈ సిరిమానుకు ముందు తెల్ల ఏనుగు, రథాలు నడుస్తుంటాయి.

Share this post with your friends
Exit mobile version