Site icon Bhakthi TV

ఆది శంకరాచార్య అవతారం గురించి తెలుసా?

ఆదిశంకరులు , శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి, ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు , మహాకవి, శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతమే అద్వైతం.శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం. ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు , మతాలూ పుట్టుకొచ్చి , ప్రజలకి సనాతన ధర్మం పట్ల , భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్టితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడని చెబుతారు. జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు , శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్‌కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది, ఆర్యమాంబ , శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడిని పొందారు. సుబ్రహ్మణ్య స్వామికి పార్వతీ దేవి ఏవిధంగా జన్మనిచ్చిందో.. అలాగే ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది.

Share this post with your friends
Exit mobile version