Site icon Bhakthi TV

మధురలోని గోపాలకృష్ణుని ఆలయం గురించి తెలుసా?

కన్నయ్య జన్మించిన మధురలోనే కొలువై ఉన్న గోపాలకృష్ణుడి గురించి కొన్ని విషయాలు దక్షిణాది వారికి పెద్దగా తెలియదు. ఈ ఆలయంలో కన్నయ్య పలు నామాలతో పిలబడుతున్నాడు. గోపాలక్రిష్ణన్ , గోవర్ధనోద్గారి , గోవర్ధనేశన్ అను నామములతో పెరుమాళ్ అని పిలుస్తారు. ఇక తాయార్‌గా పిలుచుకునే అమ్మవారు.. సత్యభామ నాచియార్, రుక్మిణి నాచియార్ అనే పేర్లతో పిలవబడుతున్నారు. ఇక్కడి పుష్కరిణిని ఇంద్ర తీర్థము , గోవర్ధన తీర్ధము అని పిలుస్తారు. విమానము : గోవర్ధన విమానము (భద్ర విమానము). ఇక మధుర విశేషాలతో పాటు ఆలయ విశేషాల గురించి ముందుగా తెలుసుకుందాం.

మధుర నగరంలో శ్రీ కృష్ణుడు జన్మించాడు కనుక ఇది శ్రీకృష్ణ జన్మభూమిగా ఖ్యాతి గాంచింది. భూగర్భ చెరసాలలో జన్మించిన శ్రీ కృష్ణుని జన్మస్థలంలో ప్రాచీన కాలంలో కేశవ్‌దేవ్ ఆలయం నిర్మించబడింది. శ్రీకృష్ణుని మేనమామ కంసుడు పాలిస్తున్న సూరసేన సామ్రాజ్యానికి మథుర రాజధాని. మథురకు పురాణ కాలం నుంచి చరిత్ర ఉంది. మథురా నగరం రామాయణ మహాకావ్యంలో వర్ణించబడింది. ఇక్ష్వాకు రాజకుమారుడూ దశరథ చక్రవర్తి కుమారుడూ రామాయణ మహాకావ్య నాయకుడు శ్రీరామచంద్రుని తమ్ముడైన శత్రుఘ్నుడు ఇక్కడ లవణాసురుని సంహరించినట్లు పురాణ కథనం. తరువాత ఆ దట్టమైన అరణ్యప్రదేశం మధువనం గానూ, మథుపురంగానూ మథురగానూ నామాంతరం చెందినట్లు పురాణ కథనం.

Share this post with your friends
Exit mobile version