Site icon Bhakthi TV

అష్ట సిద్ధులు, నవ నిధులను ఎవరికి ఎవరు ప్రసాదించారంటే..

అష్టసిద్ధులు, నవ నిధుల గురించి మనం వింటూనే ఉంటాం. కానీ అవేంటో చాలా మందికి తెలియదు. అష్ట సిద్ధులు అంటే ఎనిమిది రకాల గొప్ప శక్తులు, నవనిధులు అంటే తొమ్మిది రకాల సంపదలు. ఈ రెండూ హనుమంతునికి సీతమ్మ తల్లి ప్రసాదించినవని పురాణాలూ చెబుతున్నాయి.

అష్టసిద్ధులు:

1. అణిమ: తన శరీరాన్ని అణుమాత్రంగా చిన్నదిగా చేసుకోగల శక్తి.
2. మహిమ: తన శరీరాన్ని ఇష్టమున్నంత పెద్దగా చేసుకోగల శక్తి.
3. లఘిమ: తన శరీరాన్ని చాలా తేలికగా చేసుకోగల శక్తి.
4. గరిమ: తన శరీరాన్ని చాలా బరువైనదిగా చేసుకోగల శక్తి.
5. ప్రాప్తి: కోరుకున్న వస్తువులను పొందగల శక్తి.
6. ప్రాకామ్య: కోరికలు తీర్చుకోగల శక్తి.
7. ఈశిత్వ: అన్నింటిపైనా అధికారం చలాయించగల శక్తి.
8. వశిత్వ:సమస్త భూతాలను వశపరచుకోగల శక్తి.

నవనిధులు:

మహాపద్మ: గొప్ప సంపద.
పద్మ: అందమైన సంపద.
శంఖ: అపారమైన సంపద.
మకర: అపారమైన ధనం.
కచ్ఛప: అపరిమితమైన సంపద.
ముకుంద: కోరినవన్ని పొందే సంపద.
కుంద: ఎల్లప్పుడూ ఉండే సంపద.
నీల: అంతరించిపోని సంపద.
ఖర్వ: ఎవరికీ దొరకని సంపద.

Share this post with your friends
Exit mobile version