Site icon Bhakthi TV

పంధర్‌పూర్ వారి గురించి తెలుసా?

మహావిష్ణువు స్వరూపమైన విఠల్ భగవానుడి గౌరవార్థం మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అత్యంత ప్రియమైన, శతాబ్దాల నాటి తీర్థయాత్రలలో ఇదొకటి కావడం విశేషం. మహారాష్ట్రలో జరిగే పంధర్‌పూర్‌ వారిలో ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. జూలై 6, 2025న అంటే వచ్చే ఆషాఢ ఏకాదశి నాడు ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈ తీర్థయాత్ర విశ్వాసం, భక్తి, సాంస్కృతిక చైతన్యంతో నిండిన పవిత్ర నగరం పంధర్‌పూర్‌లో ముగుస్తుంది.

వార్కారీలు లేదా భక్తులు, పంఢర్‌పూర్ వారి భక్తి ఊరేగింపులో అనేక రోజుల పాటు కీర్తనలు, అభంగాలు లేదా భక్తి గీతాలు పాడుతూ కవాతు చేస్తారు. దేహు నుంచి సంత్ తుకారాం మహారాజ్.. అలండి నుంచి సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ వంటి రెండు ముఖ్యమైన పాల్ఖీ ఊరేగింపులు ఈ తీర్థయాత్రలో భాగంగా జరుగుతాయి. వారి దాదాపు 20 రోజుల్లో 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. పాల్ఖిలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చర్చలు, సమాజ కార్యక్రమాల కోసం వారి వెళ్లే దారిలో ఉన్న కొన్ని నగరాలు, గ్రామాలలో ఆగుతారు. ఈ ఆధ్యాత్మిక ఉత్సవం మహారాష్ట్రలో అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటి.

Share this post with your friends
Exit mobile version