Site icon Bhakthi TV

దీగూడు గురించి తెలుసా?

పల్లెల్లో అప్పటి ఇళ్లల్లో దీగూడు అని ఉండేది. దీగూడు అంటే ఏమిటో కాదు.. దీపం గూడు అని అర్థం. ప్రతి ఇంట్లోనూ అప్పటి కాలంలో ఈ దీగూడు తప్పనిసరిగా ఉండేది. అది వీధి వాకిలికి ఎదురుగా అందరికీ కనపడేట్టు ఉండేది. తల వాకిలికి ఇరు వైపులా రెండు దీపం గూళ్లు ఉండేవి. ఇంటి లోపలి దీగూడులో మట్టి ప్రమిదలో మంచి నూనె (నువ్వుల నూనె) వేసి వెలిగించేవారు. ప్రమిద కింద ఆవుపేడ ఉంచి దాని మీద ప్రమిద ఉంచే వారు ప్రమిదలో ఓ రాగినాణెం వేసేవారు దీపం వెలిగించే వారు.

దీగూడు గురించి తెలుసా?

బయట వాకిలికి ఇరువైపులా ఉన్న దీపం గూళ్లలో విప్ప నూనె వేసి వెలిగించే వారు. బయట ఎందుకు అంటే బయట వీదుల్లో నడిచే వారికి మనకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. మన సంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ఈ విద్యుద్దీపాలు వచ్చాక అన్నీ పోయాయి. దేవుడి దగ్గర ఓపిక ఉన్న నాడు దీపం పెడుతున్నారు. ఏమి అంటే ఉద్యోగం టైం లేదు అని సాకు చెప్పేస్తున్నారు. తినడానికి ఉన్న టైం.. దీపం పెట్టడానికి లేదా? అనే సందేహం రావొచ్చు. దీపం పెట్టాలనే ఆసక్తి కూడా ఉండాల్సి ఉంటుంది. బిజీ లైఫ్‌లో భగవంతుడిపై ఆసక్తి కూడా సన్నగిల్లుతోంది. చాలా కొద్ది మంది మాత్రమే ఉదయం, సాయంత్రం దీపం పెడతారు.

Share this post with your friends
Exit mobile version