Site icon Bhakthi TV

దశ దానాల గురించి తెలుసా?

దూడతో ఉన్న ఆవు, భూమి, నువ్వులు, బంగారం, ఆవు నెయ్యి, వస్త్రాలు, ధాన్యం, బెల్లం, వెండి, ఉప్పు…ఈ పదింటిని దశ దానాలుగా శాస్త్రాల్లో నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. వాటిలో మొదటి మూడు దానాలైన గోదానం, భూదానం, తిల దానం వలన కలిగే ప్రయోజనమేంటో తెలుసుకుందాం.

గోదానం: గోవులో సమస్త లోకాలు ఉంటాయి. పాలిచ్చే ఆవు, దూడతో కలిపి బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురం, రాగి తోక, నూతన వస్త్రాలతో అలంకరించి, పాలు పితికే పాత్రను కలిసి దానం చేస్తే శ్రీమహావిష్ణువు సంతుష్టుడై దాతకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది.

భూదానం: కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా భూమి శూన్యంలోకి దొర్లిపోతుంటే శ్రీమహావిష్ణువు వరాహావతారం దాల్చి తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రం, సమస్త సస్యసమృద్ధం అయిన భూమిని దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది.వీరికి శివలోకప్రాప్తిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు.

తిలదానం: తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయడం వల్ల సమస్త పాపాలు నశించి విష్ణులోకం ప్రాప్తిస్తుంది.

Share this post with your friends
Exit mobile version