Site icon Bhakthi TV

అన్నాచెల్లెళ్ల పండుగ గురించి తెలుసా? అదెప్పుడంటే..

రాఖీ పండుగ మాదిరిగానే హిందూ మతంలో మరో పండుగ కూడా ఉంది. అదే అన్నాచెల్లెళ్ల పండుగ. ఈ పండుగను హిందువులంతా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ నాడు సోదరీమణులను తమ ఇంటికి పిలిచి రకరకాల వంటకాలతో కడుపు నిండా భోజనం పెట్టి మరీ పూజిస్తారు. అనంతరం సోదరీమణులకు బహుమతులిస్తారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా భాయ్ దూజ్ లేదా అన్నాచెల్లెళ్ళ పండగ అని పిలుస్తారు. ఒకరకంగా ఇది కూడా రాఖీ పండుగ మాదిరినే జరుపుకుంటారు. మరి అన్నాచెల్లెళ్ల పండుగను మనం ఎప్పుడు జరుపుకుంటామో తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్షం రెండవ రోజున అంటే దీపావళి పండగ వెళ్ళిన రెండోరోజున అన్నాచెల్లెళ్ళ పండగను జరుపుకోవడం ఆనవాయితీ. అన్నా చెల్లెళ్ల తిథి నవంబర్ 2వ తేదీ రాత్రి 8:21 గంటలకు ప్రారంభమై నవంబర్ 3వ తేదీ రాత్రి 10:05 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం జరుపుకుంటాం కాబట్టి నవంబర్ 3న అన్నాచెల్లెళ్ల పండుగ జరుపుకుంటాం. ఆ రోజున సోదరుడికి తిలకం పెట్టి పూజ చేయడానికి అనువైన సమయం వచ్చేసి మధ్యాహ్నం 1:19 నుంచి 3:22 వరకు ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version