
కష్టాలు మనిషికి కాకపోతే మానులకొస్తాయా? అయితే కొందరికి ఇలా వచ్చి అలా వెల్లిపోతే.. మరికొందరికి తిష్ట వేసి మరీ కూర్చొంటాయి. కష్టాలొచ్చినప్పుడు మనిషికి తప్పక గుర్తొచ్చేది భగవంతుడే. బాధలు, కష్టాలొచ్చినప్పుడు చాలా మంది పరిహారాలు చేస్తారు. ముఖ్యంగా ఈ పరిహారాలు ఆదివారం చేయడం వల్ల మానసిక ఊరటతో పాటు కాస్త ఉపశమనం లభిస్తుందట. ఆదివారం సూర్యభగవానుడికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున కొన్ని పరిహారాలు చేస్తే మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఆదివారం ఉదయాన్నే శుచిగా స్నానం చేసి తూర్పు వైపు తిరిగి ముందుగా సూర్యుడికి అర్ఘ్యమివ్వాలి. ఈ అర్ఘ్యాన్ని ఫలానా ప్లేస్లోనే ఇవ్వాలన్న నియమం ఏమీ లేదు. “ఓం సూర్యాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఆదిత్యాయ నమః” అనే మంత్రాలు జపిస్తూ సూర్యుడికి అర్ఘ్యమివ్వాలి. అలాగే దానం చేసినా కూడా మంచి జరుగుతంది. ఆదివారం రోజు పేదవారికి బెల్లం, పాలు, బియ్యం, ఎరుపు రంగు వస్త్రాలు, రాగి పాత్రలు దానం చేస్తే జాతకంలో గ్రహాల స్థానం మారి మంచి జరుగుతుందట. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆదివారం నాడు దీపం వెలిగిస్తే నెగిటివిటీ మొత్తం పోతుంది. పూజానంతరం తిలకాన్ని నుదుటన ధరిస్తే పనిలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
