Site icon Bhakthi TV

ఒకరి పాపాలు మరొకరికి అంటుతాయా? శుభకార్యాల్లో చందనం ఎందుకు పూస్తారు?

ఒకరి పాపాలు ఒకరికి అంటుతాయా? అంటే అంటుతాయని పండితులు చెబుతారు. మరి ఎవరు చేసిన పాపాలు.. ఎవరికి అంటుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజలు చేసిన పాపాలు రాజుకు, రాజు చేసే పాపాలు పురోహితులకూ, భార్య చేసిన పాపాలు భర్తకూ, శిష్యుడు చేసిన పాపము గురువుకూ సంక్రమిస్తాయి. మగపిల్లాడు తప్పు చేస్తే తల్లీ, ఆడపిల్ల తప్పు చేస్తే తండ్రి బాధ్యులని చెబుతారు.

శుభకార్యాల్లో ఆడవాళ్ళ గొంతుకి చందనం ఎందుకు పూస్తారు?

భార్య భర్త ఇంటిలోని వారితో పాటు చుట్టాలూ, స్నేహితులూ.. ఇలా ఎందరినో అభిమానంతో పలకరించాలి. భర్తా, అత్తా, మామా వంటి వారితో ఎంతో అభిమానంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు సరళంగా, – సౌమ్యంగా మాట్లాడాలి. చందనం మెడకి వ్రాయటం ద్వారా గొంతు – సరళంగా వస్తుంది. సున్నితంగా సరళంగా తీయగా మాట్లాడటం వల్ల ఆమెపై గౌరవాభిమానాలు పెరుగుతాయి. ఒక్కోసారి చెప్పే విషయం వినయంగా ఉన్నా మాటగట్టిగా, కఠినంగా ఉంటే తమను ఎదురించేలా మాట్లాడుతుందని అనుకునే ప్రమాదం ఉంది. స్త్రీరూపానికి తగ్గట్టు స్వరమూ ఉండాలని చందనం రాస్తారు. చందనం శుభానికి సూచన కూడా.

Share this post with your friends
Exit mobile version