Site icon Bhakthi TV

రాఖీ రెండు రాజ్యాలను కాపాడిందట.. మరి అవేంటో తెలుసా?

రాఖీ రాజ్యాన్నే కాపాడిందట. దీని గురించి మీకు తెలుసా? రెండు సందర్భాల్లో ఇది జరిగిందట. ఇప్పటి మాదిరిగా కాదు.. అప్పట్లో అంతా మాటపై నిలబడేవారట. మన దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్రల గురించి తెలిసిందే. అతడిని పురుషోత్తముడనే రాజు ఎదుర్కొన్నాడు. పురుషోత్తముడి విజయం ఖాయమనుకుంటున్న సమయంలో పురుషోత్తముడికి అలెగ్జాండర్ భార్య రొక్సానా రాఖీని పంపించిందట. యుద్ధంలో తన భర్తను వధించవద్దని కోరిందట. సరేనన్న పురుషోత్తముడు అవకాశం వచ్చినా అలెగ్జాండర్‌ని హతమార్చకుండా వదిలేశాడని చెబుతారు. అయితే దీనికి చారిత్రక ఆధారాలు మాత్రం ఏమీ లేవు.

ఇక మొఘల్ చక్రవర్తి హుమయూన్ విషయంలోనూ అదే జరిగిందట. 15వ శ‌తాబ్దంలో రాజ‌స్థాన్‌లోని చిత్తోడ్ ప్రాంతాన్ని, క‌ర్నావ‌టి అనే రాణి పాలించేది. ఒక‌సారి చిత్తోడ్ పైకి బహదూర్ షా అనే రైతు దండెత్తి రాగా.. అతడిని ఎదుర్కోలేక మొఘల్ రాజు హుమయూన్‌కి కర్నావటి రాఖీని పంపించిందట. అప్పుడు హుమయూన్ వచ్చి బహదూర్ షాను ఓడించాడట. మొత్తానికి రాఖీ రెండు రాజ్యాలను కాపాడిందని చెబుతుంటారు. ఇక రేపే రాఖీ పౌర్ణమి. ఈ పండుగను జరుపుకునేందుకు భారతీయులంతా సిద్దమవుతున్నారు.

Share this post with your friends
Exit mobile version