Site icon Bhakthi TV

ఈ కర్ర గణనాథుడిని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు..

ఓ గ్రామంలో ఉన్న పార్వతీ పుత్రుడిని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ బ్రహ్మ ముహూర్తాన పూజలు మొదలవుతాయి. అర్థరాత్రి వరకూ పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడి లంబోదరుడు కోరిన కోరికలన్నీ తీర్చేస్తాడట. వినాయకచవితికి వెలిసే తీరొక్క రూపాల వినాయకుడు ఇక్కడ ఉండడు. డీజే మోతలు ఉండవు. సమిష్టిగా ఊరంతా కలిసి ఒకే చోట గణనాథుడికి పూజలు నిర్వహిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గణనాథుడు కర్రలో కొలువై దర్శనమిస్తాడు. అయితే ఇక్కడి గణనాథుడిని నిమజ్జనం చేయరు.

ఇక ఈ గణనాథుడు ఎక్కడంటే.. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నిర్మల్ జిల్లాలోని మరాఠి కుగ్రామం పాలజ్‌లో ఉంది. స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో పునికి కర్ర గణనాథుడు కొలువుదీరాడు. 75 ఏళ్లుగా కర్ర రూపంలో గణనాథుడు దర్శనమిస్తున్నాడు. పాలజ్, తానూర్ , చిక్లీ , బోని పేర్లేవైనా.. కర్ర గణనాథుల నిండైన రూపానికి నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడి గణనాథుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. వినాయకచవితి సమయంలో 11 రోజుల పాటు ఇక్కడి గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తుంటారు.

Share this post with your friends
Exit mobile version