Site icon Bhakthi TV

దశగ్రీవుడికి రావణుడనే పేరు పెట్టింది శివుడే..

రావణాసురుడు, అతని సోదరుడు కుంభకర్ణుడు భీకర తపస్సు చేసి బ్రహ్మ దేవుడిని మెప్పించారు. దీంతో సంతోషించిన బ్రహ్మ.. వారిద్దరిపై అనేక వరాలను కురిపించాడు. బ్రహ్మ దేవుడి నుంచి వరాలు, శక్తులను పొందిన తరువాత ఇద్దరూ కలిసి లంకను జయించి తమ సోదరుడైన కుబేరుడిని లంక నుంచి తరిమేశారు. ఇక వర గర్వంతో రెచ్చిపోయిన రావణుడు ఒకసారి ఏకంగా శివుడి నివాస స్థలమైన కైలాస పర్వతాన్నే పెకలించేందుకు యత్నించాడు. పరమేశ్వరుడు ఆ సమయంలో ధ్యానం చేస్తున్నాడు.

కైలాస పర్వతాన్ని పెకిలించడానికి రావణుడు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు శివుడు తన కాలి వేళ్ళతో పర్వతాన్ని అణిచిపెట్టాడు. అప్పుడు రావణుడు బాధతో కేకలు వేశాడు. ఆ తరువాత భోళా శంకరుడిని సైతం వేద మంత్రాలతో పూజించి ఆయన అనుగ్రహం పొందాడు. అప్పుడు శివుడు.. ‘దశగ్రీవ నీవు ఇన్ని కేకలు వేశావు. ఇంత రవం చేసావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నా’ అని చెప్పాడు. అప్పటి నుంచి దశగ్రీవుడకి రావణాసురుడు అనే పేరు వచ్చింది. రావణుడు అంటే గర్జించేవాడని అర్థం.

Share this post with your friends
Exit mobile version