Site icon Bhakthi TV

దేశంలోనే అత్యున్నత వేద విద్యాకేంద్రంగా శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం

భారతీయ సంస్కృతికి మూలాధారమైన వేద సంప్రదాయాల పరిరక్షణ, ప్రచారం, ప్రోత్సాహంలో తిరుమల తిరుపతి దేవస్థానం అగ్రగామిగా నిలుస్తోంది. ఈ దిశగా తిరుమలలోని ధర్మగిరిలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం దేశంలోనే అత్యున్నత వేద విద్యా కేంద్రంగా వెలుగొందుతోంది.

దేశంలోనే అత్యున్నత వేద విద్యాకేంద్రంగా శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం

వేద విజ్ఞాన పీఠం చ‌రిత్ర‌ :

1884 ఫిబ్రవరిలో మహంత్ ప్రయాగ్ దాస్ జీ ఆధ్వర్యంలో స్థాపించబడిన ఈ వేదపాఠశాల ప్రారంభంలో మూడు విభాగాలతో మొదలై కాలక్రమేణా వేద, ఆగమ, పౌరోహిత్యం, శాస్త్ర విద్యలను సమగ్రంగా బోధించే విశిష్ట సంస్థగా అభివృద్ధి చెందింది. 1992లో తిరుమల ధర్మగిరిలో శాశ్వతంగా స్థాపించబడిన ఈ సంస్థకు “వేద విజ్ఞానపీఠం”గా పున: నామకరణం చేశారు.

విద్యార్థుల భ‌విష్య‌త్తుకు భ‌రోసా :

వేద విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యేక ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోంది. వేద కోర్సుల విద్యార్థుల పేరుపై రూ.3 లక్షలు, ఇతర కోర్సుల విద్యార్థులకు రూ.ఒక‌ లక్ష డిపాజిట్ చేస్తోంది. కోర్సు పూర్తయ్యాక వడ్డీతో సహా మొత్తం అందజేసి మెరిట్ సర్టిఫికేట్‌తో పాటు శ్రీవారి 10 గ్రాముల వెండి డాలర్ ప్రదానం చేస్తారు.

Share this post with your friends
Exit mobile version