Site icon Bhakthi TV

పిల్లికో ఆలయం.. ఎక్కడుందో తెలుసా?

మన దేశంలో జంతువులను, ప్రకృతిని దేవుళ్లుగా పూజిస్తూనే ఉంటాం. ఒకచోట తేలుకు కూడా ఆలయం ఉంది. కుక్కలకు కూడా ఆలయం ఉంది. ఈ క్రమంలోనే పిల్లికి కూడా మన దేశంలో ఆలయం ఉందని తెలుసా? పిల్లిని అక్కడ భగవంతుని మాదిరిగా పూజిస్తారు. పిల్లి ఎదురొస్తేనే అపశకునమని భావించే మన దేశంలో పిల్లికి ఆలయం కట్టి పూజించడం కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని బెక్కలెలె గ్రామంలో ఈ ప్రత్యేకమైన పిల్లి దేవాలయం ఉంది. ఇక అక్కడ పిల్లులను పూజించే సంప్రదాయం ఇప్పుడు కాదు.. వెయ్యేళ్ల క్రితమే ప్రారంభమైంది.

అక్కడి వారంతా తమ గ్రామ దేవత అయిన మంగమ్మ పిల్లి రూపంలో గ్రామంలోకి ప్రవేశించి.. దుష్ట శక్తుల బారి నుంచి తమ గ్రామాన్ని కాపాడుతోందని నమ్ముతున్నారు. ఈ గ్రామంలో పిల్లికి ఎలాంటి హానీ చేయరు. ఎవరైనా హాని చేయాలని చూసినా కూడా వారిని గ్రామస్తులు వదలరు. పిల్లి చనిపోయిందా? దానికి గౌరవ మర్యాదలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా మంగమ్మ రూపంలోని పిల్లికి పండుగను నిర్వహిస్తూ ఉంటారు. మూడు రోజుల పాటు ఈ పండుగ గ్రామంలో పెద్ద ఎత్తున జరుగుతుంది.

Share this post with your friends
Exit mobile version