Site icon Bhakthi TV

సాలగ్రామం ఇంట్లో ఉంచవచ్చా? ఉండకూడదా?

హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనది సాలగ్రామం. సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు స్వరూపంగా ఈ సాలగ్రామాన్ని భావిస్తూ ఉంటారు. సాలగ్రామం అనేది ఒక దివ్యశిల. దీనికి పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని హిందువుల భావన. ఇంత గొప్పగా భావించే సాలగ్రామాన్ని ఇళ్లలో ఉంచుకునేందుకు దాదాపుగా ఆసక్తి కనబరచరు. అసలు ఇలా ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదని భావిస్తూ ఉంటారు. దీనిలో నిజమెంత? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాలగ్రామ పూజ సాధారణమైనది కాదు. చాలా కఠినమైన నియమాలతో కూడుకున్నది. అలాగే సాలగ్రామం ఇంట్లో ఉంటే నిరంతరం ఆ నియమాలను పాటించాల్సి ఉంటుంది.

సాలగ్రామం ఇంట్లో ఉందంటే.. ముందుగా ఆ ఇంటితో పాటు ఇంట్లోని వారంతా పరిశుభ్రంగా ఉండాలి. సాలగ్రామానికి నిత్యం స్నానం చేయించి ఆపై తప్పక నిత్య పూజ చేయాలి. అలాగే నిత్య నైవేద్యం సమర్పించాలి. సాలగ్రామాన్ని ఉంచిన ప్రదేశం, పూజ చేసేవారు అత్యంత పరిశుభ్రంగా ఉండాలి. ఇంటిలోని స్త్రీలు నెలసరి సమయంలో సాలగ్రామం దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదు. ఈ సమయంలో కూడా పూజకు ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నిత్య పూజ చేయలేని పరిస్థితుల్లో (ప్రయాణాలు, అనారోగ్యం వంటివి) సాలగ్రామాన్ని వేరొకరికి అప్పగించడమో లేదంటే మందిరంలో ఉంచడమో చేయాలి. ఇన్ని నియమాలు ఉంటాయి కాబట్టే సాలగ్రామం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Share this post with your friends
Exit mobile version