![]()
సంభాల్ కల్కి అవతారం గురించి సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు పెను దుమారానికి దారి తీశాయి. అయితే ఆయన వ్యాఖ్యలకు కేలా దేవి ఆలయానికి చెందిన మహంత్ రిషిరాజ్ గిరి కూడా మద్దతు ఇచ్చారని తెలుసుకున్నాం కదా. 88 వేల మంది మహర్షులకు శ్రీమద్ భగవత్ వృత్తాంతాన్ని వివరిస్తూ భగవంతుడు కల్కి అవతారమెత్తాడని పురాణాలలో చెప్పబడిందని మహర్షి రిషిరాజ్ తెలిపారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. కలియుగం ముగిసే సమయానికి మనుషులు గాడిదల్లా తయారవుతారట. ఆ తరువాత మనుషులు ఒకరినొకరు చంపుకుని తినడం మొదలుపెడతారని మహంత్ రిషిరాజ్ గిరి తెలిపారు.
కల్కి అవతార సమయం, స్థలాన్ని సైతం శుక్రదేవుడు వివరించారని రిషిరాజ్ తెలిపారు. శ్రావణ మాస శుక్ల పక్ష పంచమి తిథి రోజున కల్కి అవతారం సంభవిస్తుందట. బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు కలిసి పుష్య నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు.. శ్రీమన్నారాయణుడు సంభాల్‌లో తన భార్య లక్ష్మీదేవితో సహా కల్కి రూపంలో అవతరిస్తాడట. అధర్మాన్ని నాశనం చేస్తాడట. దేవదత్ అనే తెల్లని గుర్రాన్ని అధిరోహించి కల్కి అధర్మాన్ని నాశనం చేస్తాడట. కల్కి రెండవ భార్య పేరు రమ అని.. ఆయనకు జై, విజయ్, మేఘమల్, బలాహక్ అనే నలుగురు కుమారులు ఉంటారు. ఆ సమయంలో భగవంతుని పూజారులుగా మహర్షి యాజ్ఞవల్కుడు, పరశురాముడు గురువుగా ఉంటారని సైతం రిషిరాజ్ వెల్లడించారు.
