Site icon Bhakthi TV

నాగదేవత ఆలయానికి అడ్డంకులు సృష్టించిన బ్రిటీష్ సైనికాధికారి

సికింద్రాబాద్‌లోని నాగ లోకాన్ని మరిపించే నాగ దేవత ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. 7 సంవత్సరాల వయస్సులో, శ్రీ జయలక్ష్మి అమ్మ మొదటిసారి నాగదేవి (నాగమాత) దర్శనం చేసుకున్నారుట. ఆ తరువాత నుంచి ఆమె భక్తితో నాగమాత దేవిని క్రమం తప్పకుండా పూజించడం ప్రారంభించారట. శ్రీ దేవరాజన్‌ను జయలక్ష్మి అమ్మ వివాహం చేసుకున్నారు. ఆమెకు 1956లో నాగదేవత అవతారాన్ని పోలిన కుమారుడు జన్మించాడట. అతనికి నారాయణ అని నామకరణం చేయగా.. చిన్ననాటి నుంచే అతను కూడా ధ్యానం చేయడం ఆరంభించారట.

9 సంవత్సరాల వయస్సులో శ్రీ నారాయణ స్వామి తన దివ్య ఆత్మను నాగ దేవతలో సమాధి చేశారని చెబుతారు. కొడుకును కోల్పోయిన జయలక్ష్మి అమ్మ శోకసంద్రంలో మునిగిపోయారట. ఆ తరువాత నాగదేవత ఆదేశానుసారం జయలక్ష్మి అమ్మ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆలయ నిర్మాణ సమయంలో బ్రిటీష్ వారు అడ్డంకులు సృష్టించారట. ఆ తరువాత వారికి నాగదేవత దర్శనమివ్వడంతోవారు కూడా సైలెంట్ అయ్యారు. ఆ తరువాత ఆలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టించిన ఆలయ అధికారి తన సతీమణితో కలిసి ఆలయాన్ని దర్శించుకున్నారట.

Share this post with your friends
Exit mobile version