Site icon Bhakthi TV

ప్రారంభమైన రిషికేష్ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు

రిషికేష్‌‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అలా ముగిశాయో లేదో ఇలా ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో ఇవాళ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలను ఆలయ అధికారులు ప్రారంభించారు. నేటి సాయంత్రం కల్ప వృక్ష వాహన సేవ నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ వరకూ జరగనున్నాయి.

నిన్న సాయంత్రం అంకురార్పణం, మూషిక వాహనసేవతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకూ స్వామివారికి ఉదయం, సాయంత్రం వివిధ రకాల వాహన సేవలు నిర్వహించనున్నారు. జూన్ 5వ తేదీ సాయంత్రం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనునున్నారు. జూన్ 6వ తేదీన ధ్వజావరోహణం, రావణాసుర వాహనంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 6వ తేదీన ధ్వజావరోహణం, రావణాసుర వాహనం వంటివి నిర్వహించనున్నారు.

Share this post with your friends
Exit mobile version