Site icon Bhakthi TV

శ్రీశైలం వెళుతున్న భక్తులకు బిగ్ అలర్ట్..

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలం వెళుతుంటారు. శ్రీశైలానికి కొందరు వాహనాల్లో వెళుతుంటారు. కొందరు మాత్రం స్వామివారికి నడిచి వస్తామని కూడా మొక్కుకుంటారు. ఈ క్రమంలోనే వారంతా నల్లమల అడవుల గుండా ఆ మల్లిఖార్జునుడిని దర్శించుకునేందుకు పయమనవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ వార్త. శ్రీశైలం వెళ్లే భక్తులు నల్లమల అడవుల్లోకి వెళ్లేందుకు ప్రవేశాన్ని నిషేధిస్తూ తాజాగా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

జూలై నుంచి సెప్టెంబర్ వరకు పులుల ఏకాంత వేళగా నిర్ణయించబడిందట. కాబట్టి ఈ నెలల మధ్య శ్రీశైలం అడవుల్లోకి వెళ్లేందుకు ప్రవేశాన్ని నిషేధిస్తూ అధికారులు వెల్లడించారు. జూలై నుంచి సెప్టెంబర్ అనేది పులుల సంతానోత్పత్తి సమయమట. కాబట్టి ఎన్టీసీఏ ఆదేశాల మేరకు ఆగష్టు నుంచి నల్లమల అడవుల్లోకి ప్రజలకు ప్రవేశంపై అధికారులు పూర్తి నిషేధం విధించారు. కాబట్టి భక్తులంతా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమో లేదంటే వాహనాల్లో శ్రీశైలానికి వెళ్లడమో చేయడం ఉత్తమం.

Share this post with your friends
Exit mobile version