Site icon Bhakthi TV

దుర్గామాత పూజకు సిద్ధమవుతున్న బెంగాల్.. దేవీ నవరాత్రుల కోసం 43 వేల మండపాలు..

పశ్చిమ బెంగాల్‌లో దుర్గాదేవికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ దుర్గా పూజను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. దుర్గా నవరాత్రులకు పెద్దగా సమయం లేదు. ఇంకా 75 రోజుల సమయం మాత్రమే ఉంది. దీని కోసం అధికరా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దేవీ నవరాత్రుల కోసం పెద్ద ఎత్తున మండపాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. బెంగాల్ వ్యాప్తంగా 43 వేల మండపాలను ఏర్పాటు చేసేందుకు నిర్వహకులు సిద్ధమవుతున్నారు. దీనికోసం అక్కడి ముఖ్యమంత్రి ఒక్కొక్క నిర్వాహకునికి రూ.85 వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే గత ఏడాది రూ.70 వేలు మాత్రమే ప్రకటించారు. దీంతో ఇది పెద్ద వివాదానికి దారి తీసింది.

దుర్గామాత మండపాలకు నిధులు పెంచేలా 2011లో మమత నిర్ణయం తీసుకున్నారు. తొలుత రూ.25 వేలతో ప్రారంభమై ఇప్పుడు 85 వేలకు చేరింది. వచ్చే ఏడాది లక్ష రూపాయలు ఇవ్వనున్నట్టు మమత ప్రకటించారు. ఇక దుర్గాదేవి మండపాలకు విద్యుత్ రాయితీని సైతం ప్రకటించారు. వివాదమేంటంటారా? అభివృద్ధి కార్యక్రమాలకైతే డబ్బులు లేవు కానీ దుబారా ఖర్చులకు మాత్రం డబ్బెక్కడి నుంచి వస్తోందని పలువురు మండి పడుతున్నారు. ఇష్టానుసారంగా మండపాలకు డబ్బును కేటాయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండపాల నిర్వహకులకు మాత్రం మమత నిర్ణయం అమితానందాన్నిస్తోంది.

Share this post with your friends
Exit mobile version