Site icon Bhakthi TV

బద్రీనాథ్ హైవే మూసివేత.. మార్గమధ్యంలోనే 5000 మంది యాత్రికులు

ఛార్‌దామ్ యాత్ర కోసం ఎంతో ఆశగా బయలు దేరిన యాత్రికులను వర్షాలు నిలువరిస్తున్నాయి. దాదాపు బద్రీనాథ్ వరకూ వెళ్లిన వారికి అక్కడ మార్గం మూసివేత ఇబ్బందికరంగా మారింది. బద్రీనాథ్ హైవేను మూసివేశారు. జోషి మఠ్ వద్ద కొండచరియలు విరిగి పడడంతో రహదారిని మూసి వేయడం జరిగింది. దీంతో బద్రీనాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. 3000 మంది యాత్రికులు మార్గమధ్యంలోనే చిక్కుకుపోయారు. 2000 మంది యాత్రికులు జోషి మఠ్ వద్దనే ఆగిపోయారు. బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు సైతం పోలీసులు మూసివేశారు.

ఉత్తరాఖండ్‌లో ఇటీవల ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో బద్రీనాథ్‌కు వెళ్లే మార్గమధ్యంలో అంటే ఛమోలీ జిల్లాలోని బహనీర్పానీ , జోషీమఠి రహదారిపై భారీగా కొండ చరియలు విరిగిపడంతో ఆ జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అనంతరం బుధవారం కూడా ఈ విధంగానే జరిగింది. బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై పాతాళ గంగా లంగసీ టనల్ వద్ద బుధవారం కూడా భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. మరో 24 గంటల పాటు రోడ్డును బ్లాక్ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రయాణికుల రక్షణకు ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఫ్ బృందాలు చర్యలు చేపట్టాయి. వారికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఆహారం, నీరు అందిస్తున్నాయి.

Share this post with your friends
Exit mobile version