Site icon Bhakthi TV

Avoid these offerings on Shivratri : శివరాత్రి రోజున స్వామివారికి సమర్పించకూడని వస్తువులు ఇవే

మహా శివరాత్రి అనేది భక్తి, నియమం, పవిత్రతకు ప్రతీక. ఈ పవిత్రమైన రోజున శివారాధన చేసే ప్రతి భక్తుడు కొన్ని ఆచారాలను తప్పక గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా శివలింగానికి సమర్పించకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనవి కేతకి పువ్వులు. ఈ పువ్వులు శివపూజలో నిషిద్ధం. పురాణ కథనం ప్రకారం బ్రహ్మదేవుడి అబద్ధానికి సాక్ష్యంగా నిలిచినందుకు పరమేశ్వరుడు కేతకిని శపించాడని చెబుతారు. అలాగే తులసి దళాలు విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి కాబట్టి శివార్చనలో వాడరాదు. కుంకుమ పార్వతీదేవికి చిహ్నం. అందువల్ల కుంకుమను శివపూజలో ఉపయోగించరు. శంఖంతో నీటిని తీసి అభిషేకం చేయడం కూడా శాస్త్రవిరుద్ధం, ఎందుకంటే శంఖం విష్ణువుకు సూచకం. అక్షతల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. విరగని అక్షతలు మాత్రమే సమర్పించాలి, పగిలిన లేదా విరిగిన వాటిని ఉపయోగించకూడదు. శివారాధనలో భక్తి ఎంత ముఖ్యమో, నియమపాలన కూడా అంతే ప్రధానమని పండితులు చెబుతున్నారు. సరైన విధంగా పూజిస్తే శివకృప లభించి… జీవితం శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో నిండుతుందని భక్తుల విశ్వాసం.

Avoid these offerings on Shivratri
Share this post with your friends
Exit mobile version