పురాతన భారతీయ వాస్తు, శాస్త్రాల ప్రకారం చెట్లు మన జీవితంపై లోతైన ప్రభావం చూపుతాయి. కొన్ని చెట్లు సానుకూల శక్తిని అందిస్తే, మరికొన్ని చెట్లు ఇంటి ఆవరణలో ఉండడం శుభకరం కాదని శాస్త్రాలు హెచ్చరిస్తాయి. రావి, చింత, మారేడు వంటి చెట్ల శక్తి అత్యంత బలమైనదిగా భావిస్తారు. వీటి నీడ ఇంటిపై పడితే ధననష్టం, మానసిక ఒత్తిడి, కుటుంబంలో శాంతి లోపిస్తుందని విశ్వాసం. రావి చెట్టులో దేవతలు, పితృదేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతాయి కాబట్టి ఇంటికి దూరంగా ఉండాలి. చింత చెట్టు నీడ బద్ధకం, వ్యాధులకు కారణమవుతుందని నమ్మకం. మారేడు చెట్టు శివునికి ప్రియమైనదైనా ఇంటికి దగ్గరగా ఉండకూడదు. ఈ చెట్లు ఇప్పటికే ఉంటే తులసి కోటను ప్రతిష్టించి ప్రతీరోజు సాయంత్రం దీపం వెలిగించాలి. నీడ పడకుండా చెట్ల కొమ్మలు కత్తిరించడం వంటివి చేయడం ద్వారా ప్రతికూలతను కొంతమేర తగ్గించవచ్చని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

