Site icon Bhakthi TV

తిరుమల శ్రీవారి సన్నిధిలో స్వాతంత్య్ర దినోత్సవ‌ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

ఆగస్టు 15న నిర్వహించే 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో గల పరేడ్‌ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేశారు. గురువారం ఉదయం 8.30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. జెండా వందనం అనంతరం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఐదు గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. చివరగా టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.

గోకులంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని తిరుమలలోని గోకులం అతిథి భవనం సర్వసన్నద్ధమైనది. గురువారం ఉదయం 7 గంటలకు జాతీయ జెండాను టీటీడీ ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకటయ్య చౌదరి వినీలాకాశంలో ఎగురవేసి గౌరవ వందనం చేయనున్నారు. అనంతరం సిబ్బందిని ఉద్ద్యేశించి స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని అందించనున్నారు. ఈ వేడుకలో తిరుమలలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పాల్గొంటారు.

Share this post with your friends
Exit mobile version