Site icon Bhakthi TV

ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న కరుంగలి మాల గురించి తెలుసా?

ఈ మధ్యకాలంలో కరుంగలి మాల గురించి ప్రతి ఒక్కరూ బాగా చర్చించుకుంటున్నారు. అసలేంటి కరుంగలి మాల? దీని ధరిస్తే ఏం జరుగుతుందనేది ముందుగా తెలుసుకుందాం. కరుంగలి మాల అంటే మరేదో కాదు.. నల్ల చందనం లేదంటే ఎబోనీ చెక్కతో చేసిన మాలను కరుంగలి మాల అంటారు. దీనిని ఇటీవలి కాలంలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ ధరిస్తున్నారు. ఈ మాలను ధరించడం వల్ల అనేక ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటి? కరుంగలి చెక్కకు నెగటివ్ ఎనర్జీని గ్రహించి, పాజిటివ్ శక్తిని ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి దీనిని దరించిన వారు చెడు దృష్టి నుంచి రక్షించబడతారని నమ్మకం.

దుష్టశక్తులు, ప్రతికూల ఆలోచనలు వంటివేమీ దరి చేరవట. ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని తగ్గించి మానసిక ప్రశాంతతను అందజేస్తుందట. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులకు ఇది మరింత ప్రయోజనకరమని చెబుతారు. వారంతా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుందట. అలాగే కరుంగలి మాల ధరించిన వారికి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుందట. వ్యాపార రంగంలో ఉన్నవారికి సమస్యలన్నీ తొలగిపోయి వ్యాపార వృద్ధి ఉంటుందట. గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయని నమ్మకం. ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనాలున్నాయని చెబుతారు. శరీరంలో వేడిని తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందట.

Share this post with your friends
Exit mobile version