Site icon Bhakthi TV

ఆ ఆలయంలో ఆంజనేయ స్వామి సజీవంగా ఉన్నాడట.. నిదర్శనమేంటంటే..

ఆలయంలో దేవతలు రాతి రూపంలోనో లేదంటే మరో రూపంలోనో ఉంటారు కానీ అంతేకానీ సజీవంగా మాత్రం ఉండరు. కానీ ఇక్కడి ఆంజనేయ స్వామివారు సజీవంగా ఉంటారని స్థానికుల నమ్మకం. దానికి నిదర్శనమేంటి? అసలెక్కడుంది ఆ ఆలయం అంటారా? కడప జిల్లా గండిలో ఉంది. ఈ వీరాంజనేయ స్వామికి చిటికెన వేలు ఉండదు. ఎవరైనా చెక్కేందుకు యత్నిస్తే స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుందట. నమ్మశక్యం కాకున్నా ఇది నిజమని స్థానికులు చెబుతున్నారు. అందుకే ఇక్కడి మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా పేర్కొంటారు.

ఇక ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే.. శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు వాయుదేవుడు బంగారు తోరణం ఏర్పాటు చేశాడట. అయితే ఈ తోరణం అందరికీ కనిపించదట. మహనీయులకు అది కూడా వారి జీవిత చరమాంకంలో ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుందట. అలా ఎవరికైనా కనిపించిందా? అంటే 18వ శతాబ్దంలో మద్రాసు రాష్ట్రంలో దత్తమండలాలకు కలెక్టర్‌గా ఉన్న సర్ థామస్ మన్రోకు కనిపించిందట. ఈ విషయం కడప గెజిట్‌లో కనిపిస్తుందట. ఇక శ్రావణమాసంలోనే శ్రీరాముడు గండి క్షేత్రానికి వచ్చాడట. కాబట్టి ఇక్కడ శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. చివరి శనివారం అయితే వీరాంజనేయుడిని ఒంటెవాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తారు.

Share this post with your friends
Exit mobile version