Site icon Bhakthi TV

గుండాలకోన గురించి ఆసక్తికర కథేంటంటే..

కడప జిల్లాలోని చిట్వేలి మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన గుండాలకోనలోని శివాలయం ప్రత్యేకతలేంటో తెలుసుకున్నాం. అక్కడి గుండం ప్రాధాన్యత ఏంటో కూడా తెలుసుకున్నాం. గుండంలో మునిగితే సర్వ పాపాలు తొలగిపోవడంతో పాటు దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తలు నమ్మకం. సంతానం లేని మహిళలు ఈ గుండం సమీపంలోని వృక్షాలకు మొక్కుబడిగా ఊయలలు కడుతారు. ఈ ప్రదేశాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ప్రకృతి రమణీయతకు ఇది నిదర్శనం.

ఎత్తైన కొండల మధ్య భీకర శబ్దం చేస్తూ నీటి ప్రవాహం, సెలయేళ్ల గలగలలు ఆకాశాన్ని తాకినట్టుండే మహావృక్షాలు, పచ్చదనంతో ఈ ప్రాంతమంతా ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుండాల కోన దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చింది. దీని గురించి ఆసక్తికర కథ ఒకటుంది. శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనుమరాలైన ఈశ్వరమ్మను వివాహం చేసుకోగోరి నిరాకరణకు గురైన రంగరాజు కొంతకాలం ఈ గుండాల కోనలో తపస్సు చేశాడట. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనమిస్తానని చెప్పినట్లుగా ఆలయ స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయంలోని కోన మల్లేశ్వరుని ఒక్కసారి దర్శిస్తే జన్మజన్మల దారిద్య్రం పటాపంచలై పోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.

Share this post with your friends
Exit mobile version