Site icon Bhakthi TV

మరిడమ్మతో పాటు, ఆమె అక్కాచెల్లెళ్లు ఆ ఉయ్యాల తాడి వద్దే ఉంటారట..

పెద్దాపురం మరిడమ్మ వారు సామర్లకోట చింతపల్లివారి ఆడపడుచుగా ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ ఆ వారుసులే ఇక్కడ ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. అసలు ఈ ఆలయ ఉయ్యాల తాడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బహులైక జేష్ఠ అమావాస్యకు పక్షం (పదిహేను రోజులు) ముందు అమ్మ వారికి ఉయ్యాల తాడిని వేస్తారు. జాతర రోజు నుంచి జాతర ముగిసే వరకూ అమ్మవారు, ఆమె ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు ఈ ఉయ్యాల తాడి వద్దే ఆడి పాడి భక్తుల ఆలనా పాలనలు చూస్తారని భక్తుల విశ్వాసం. ఈ ఉయ్యాల తాడిని రైతులు వారి వారి పొలాల గట్లమీద ఏపుగా ఎదిగిన తాడిని సమర్పించడానికి ఎగబడతారు.

అలా సమర్పించడానికి రైతులు ఆలయ కమిటీ వారికి 6 నెలల ముందుగానే చెప్పుకోవలసి ఉంటుంది. ఉయ్యాల తాడిని కేవలం భుజాల మీద మాత్రమే దాదాపు 100 మందికి పైగా హరిజన సోదరులు ఊరేగింపుగా ముందు డప్పులు మోగుతుంటే ఆ తదుపరి గరగలు నడుస్తూ వుంటే దారిపొడవునా గ్రామ ప్రజలు ఆడపడుచులు తాడిలకు స్నానం చేయించి పసుపు కుంకుమలు రాసి పాత పెద్దాపురం కోటముందు మీదుగా గుడివద్దకు సాగనంపుతారు (వారిని కాదని వేరొకరు తేలేరు ఆ దారి కాదని వేరొక దారి పోరాదు). అది వారి భుజాల మీదుగా ఆ దారి మీదుగానే గుడివద్దకు రావాలి అది అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పటికీ కొనసాగుతోంది.

Share this post with your friends
Exit mobile version