Site icon Bhakthi TV

ఆది శంకరాచార్యుల వారు ‘వివేక చూడామణి’లో చెప్పిన జీవిత సత్యమేంటంటే..

మన వాళ్ళే కాదు, ఒక్కొక్కసారి మన శరీరంలోని అవయవాలు, ఇంద్రియాలు కూడా మనల్ని మోసం చేస్తాయి.. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది అక్షరాలా నిజం. ఈ విషయాన్ని 7వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరాచార్యుల వారు ‘వివేక చూడామణి’ అనే గ్రంథంలో సైతం వివరించారు. నీటిలో ఉన్న చేప ఎరను చూడగానే , వాసన తగిలి ఎరకు తగులుకుని, జాలరి బుట్టలోకి పోతుంది.. అంటే దాని నాలుకే దానిని మోసం చేసింది. చుట్టుపక్కల ఎన్ని తినే పదార్ధాలున్నా, మంటను చూడగానే మిడత అందులో పడుతుంది.. దాని కన్నులే దానిని మోసం చేశాయి.. అనసంపెంగ పూవు వాసన తగలగానే భ్రమరం దాని మీద వాలి, మకరందాన్ని గ్రోలుతుంది. అందులోని విషపదార్థ ప్రభావం చేత భ్రమరం చనిపోతుంది..

మిగిలిన ఏ పూవు మీద వాలినా ఏమీ కాదు, ఒక్క సంపెంగ తప్ప .. అంటే… దాని ముక్కు దానిని మోసం చేసిందన్న మాట. మగ ఏనుగును వేటాడటానికి ఆడ ఏనుగును పంపు తారు.. అది మగ ఏనుగును రాసుకుంటూ వెళ్తుంది. చర్మ రాపిడికి మగ ఏనుగు ఆడ ఏనుగు వెనుకే వెళ్ళి వేట గాళ్ళకు చిక్కుతుంది.. దాని చర్మమే దానిని మోసం చేసిందన్న మాట.. లేడి పిల్లల్ని పట్టుకోడానికి వేణువును ఊదుతారు.. వేణు గానం వినగానే అటు వైపు వెళ్ళి చక్కగా దొరికిపోతాయి.. వాటి చెవులే వాటిని మోసం చేశాయి.. ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క ఇంద్రియమే ఎక్కువ చురుకుగా ఉన్న ఈ జీవులే ఇంతలా మోసపోతున్నప్పుడు, పంచేంద్రియాలూ చురుకుగా ఉన్న మనిషి మోసపోకూడదు అనుకుంటే… ఇంకెంతో జాగ్రత్తగా ఉండాలి..

Share this post with your friends
Exit mobile version