Site icon Bhakthi TV

ఈ శివాలయాన్ని దర్శించుకుంటే చాలట.. ఎంతటి మానసిక ఒత్తిడైనా మాయం..

హిందూ దేవుళ్లలో భోళా శంకరుడు కాస్త స్పెషల్. ఎందుకంటే ఆయనను మెప్పించడం చాలా సులువు. అభిషేక ప్రియుడైన శివయ్యను కాస్త జలంతో అభిషేకించినా చాలు పొంగిపోయి మనపై వరాల జల్లు కురిపిస్తాడు. అయితే జ్యోతిర్లింగాలు మరింత స్పెషల్ అందునా గుజరాత్‌లోని ద్వారకలో ఉన్న సోమనాథ ఆలయానికి మరింత ప్రత్యేకత ఉంది. దీనిని చంద్రుడు ప్రతిష్టించారని చెబుతాడు. దీనికి సంబంధించిన కథ కూడా మనకు తెలిసిందే. శ్రావణ శివరాత్రి నాడు ఇక్కడి శివయ్యను పూజిస్తే ఫలితం చాలా బాగుంటుందట. 155 అడుగుల ఎత్తులో ఈ శివాలయం ఉంటుంది.

గుజరాత్‌లోని కతియావార్ ప్రాంతంలో సముద్రతీరంలో ఉంటుందీ ఆలయం. చంద్రుడు నిర్మించిన ఈ ఆలయం ముస్లిం దాడుల్లో విచ్ఛిన్నమైన ఆలయాన్ని ఆరు సార్లు విచ్ఛిన్నం చేయగా… సర్దార్ వల్లభాయ్ పటేల్ చివరిసారిగా ఈ ఆలయాన్ని నిర్మించారు. మానసిక ఆందోళన, ఒత్తిడిని ఎదుర్కొనేవారు ఈ సోమనాథేశ్వర ఆలయాన్ని దర్శించుకోవాలట. అలాగే జ్యోతిష్య ప్రకారంగా చంద్ర దోషం ఉన్నా.. జాతకంలో చంద్రుడు క్షీణ దశలో ఉన్నా కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిదట. చంద్రదోషం తొలగిపోతుందట. శివలింగాన్ని ఎప్పుడూ కూడా తెల్లని దుస్తులతో వెళ్లి దర్శించుకోవాలట. అంతేకాదు… జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే కంటి సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ పోతాయట.

Share this post with your friends
Exit mobile version