Site icon Bhakthi TV

రాత్రికి ఆకాశంలో అద్భుతం.. ఏం జరగనుందంటే..

ఇవాళ దేశమంతా హోలీ పండుగ జరుపుకుంటోంది. మరోవైపు లక్ష్మీదేవి జయంతి కూడా కావడంతో ఇవాళ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది మాత్రమే కాదు.. ఇవాళ రాత్రి ఆకాశంలో ఒక అద్భుతం చోటు చేసుకోబోతోంది. అదే బ్లడ్‌ మూన్‌. ఈ ఏడాది మొదటి గ్రహణం ఇవాళ సంభనించనుందన్న విషయం తెలిసిందే. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారత్‌లో మాత్రం కనిపించదు. అయితే ఈసారి బ్లడ్ మూన్ అని పిలవబడే చంద్రగ్రహణం ఈసారి ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక సరళరేఖ పై ఉన్న సమయంలో చంద్రుడిపై భూమి నీడ పడడం వలన పూర్తిగా కప్పేయడమే చంద్ర గ్రహణం.

అయితే గ్రహణం సమయంలో చంద్రుడు ఎప్పుడూ కనపడే రంగులోనే ఉంటాడు. కానీ బ్లడ్ మూన్ సమయంలో చంద్రుడు వేరొక రంగులో కనిపిస్తాడు. బ్లడ్ ఏ రంగులో ఉంటుందో తెలిసిందే. అలా చంద్రుడు పూర్తిగా ఎరుపు లేదా నారింజ రంగులో కనిపిస్తాడు. సూర్యుడి నుంచి వచ్చే ఎరుపు లేదా నారింజ కిరణాలు భూమిపై నుంచి ప్రయాణం చేసి చంద్రుడి వర్ణాన్ని మారుస్తాయి. దీనిని రేలీ స్కాటరింగ్ అంటారు. అయితే ఇదొక ఖగోళ వింత మాత్రమేనని అంటారు. దీనికి అంతకు మించి ప్రాధాన్యత లేదని చెబుతారు. ఇది కేతు గ్రస్త ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణమని జ్యోతిష్య పండితులు చెబుతారు. దీని ప్రభావం కొన్ని రాశుల వారిమీద ఉంటుందట.

Share this post with your friends
Exit mobile version