Site icon Bhakthi TV

ఇస్కాన్ టెంపుల్‌లో కన్నయ్యకు 108 రకాల నైవేద్యాలు.. 2 టన్నుల పువ్వులతో పుష్పాభిషేకం..

విజయవాడలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ మూడు రోజుల పాటు జన్మాష్టమి వేడుకలను ఇస్కాన్ టెంపుల్ నిర్వహించనుంది. నిన్నటి నుంచే ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 108 రకాల నైవేద్యాలతో కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇస్కాన్ టెంపుల్‌కు వచ్చి కన్నయ్యను దర్శించుకుంటున్నారు. రాధాకృష్ణులకి 2వేల కిలోల పువ్వులతో పుష్పాభిషేకం నిర్వహించారు. అలాగే పంచామృతాలతో కలశాభిషేకాలు నిర్వహించారు.

జిల్లా స్థాయిలో కళాశాల విద్యార్థులతో ఉట్టి మహోత్సవానికి సంబంధించిన పోటీలను ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు నిర్వహించనున్నారు. పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులను సైతం అందించనున్నారు. ఈ బహుమతి మహోత్సవ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్‌ను ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు ఆహ్వానించారు. ఇక ఇక్కడ మాత్రమే కాకుండా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సైతం సాయంత్రం కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి వేడుకలు నిర్వహించనున్నారు. మొత్తానికి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విజయవాడలోని ఆలయాలన్నీ రద్దీ రద్దీగా ఉన్నాయి.

Share this post with your friends
Exit mobile version