Site icon Bhakthi TV

నరసింహ గాయత్రి మంత్రం జపిస్తే ఏం జరుగుతుందంటే..

నృసింహోపాసన గొప్పతనం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నృసింహ గాయత్రి మంత్రం గురించి తెలుసుకుందాం. గాయత్రి మంత్రం ఎలాంటి రోగాలనైనా పోగొడుతుంది. సర్వ ఉపద్రవాలను నివారిస్తుంది. ఈ నృసింహ గాయత్రి జపం చేసుకుంటూ ఉంటే విశేషమైన ఫలితం లభిస్తుంది. చేతిలో భస్మంకానీ, కుంకుమ కానీ పట్టుకొని నృసింహ గాయత్రి పఠనం చేసి ధరిస్తే రక్షణ లభిస్తుంది. ఇది నృసింహ గాయత్రి మంత్రం దీనికి మాలామంత్రం, మంత్రరాజం అని పేరు. బాధ తీవ్రంగా ఉంటే ఈ మంత్రం తప్పక నూరు మార్లు పఠించమని చెప్తున్నారు.

“ఓం నరసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి
తన్నో సింహ ప్రచోదయాత్”

ఈ మంత్రం అర్థమేంటంటే.. ‘‘వజ్రంతో తయారు చేయబడినంత బలమైన గోర్లు ఉన్నవాడు. నేను సింహ దేవుడిని సంతోషపెట్టడానికి ఉన్నాను. కాబట్టి అతను నన్ను సరైన మార్గంలోకి తీసుకువెళ్లి నా భయాలను తొలగిస్తాడు’’ అని అర్థం. గాయత్రి మంత్రాలను క్రమం తప్పకుండా జపించే వారి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడి ధైర్యంగా ఉంటాడట. ప్రపంచంలోని ఏ దుష్ట శక్తి కానీ అడ్డంకులు కానీ అతనికి హాని కలిగించలేవట. నరసింహ మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల నరసింహ స్వామి ఆశీస్సులు మరియు ఆయన రక్షణ కవచం లభిస్తాయి.

Share this post with your friends
Exit mobile version