Site icon Bhakthi TV

Why You Should Read The Bhagavad Gita : భగవద్గీత ఎందుకు చదవాలి?

సకల సమస్యలకు పరిష్కారాలు భగవద్గీతలో ఉంటాయని చెబుతారు. ఒకటేమిటి.. జీవితంలో ఎలా ఉన్నా కూడా భగవద్గీత చదివితే మనకు ఏది.. ఎందుకు.. ఎలా జరిగిందనేది అర్థమవుతుందని పండితులు చెబుతారు. సంతోషంగా ఉన్న సమయంలో.. బాధలో ఉన్నప్పుడు సైతం భగవద్గీతను చదవాలని పండితులు చెబుతారు. ఏమి తోచని స్థితిలో ఉన్నా.. ఏదో గెలిచినా.. దేనిలోనైనా ఓడిపోయినా కూడా భగవద్గీతను పఠించాలి. ఎవరికైనా చెడు చేసినా.. లేదంటే ఏదైనా సాధించాలని అనుకున్నా కూడా భగవద్గీతను పఠిస్తే తద్వారా స్ఫూర్తిని పొందవచ్చు. నువ్వు ఏది సాధించలేక పోతున్నానని బాధలో ఉన్నాలో లేదంటే.. ఏది సాధించ లేక ఉన్నా కూడా భగవద్గీత చదవాలి. చాలా ధనవంతుడైనా.. బీదవాడైనా.. సమాజాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నా కూడా భగవద్గీతనే పఠించాలి.

Why You Should Read The Bhagavad Gita

ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నా.. ఎవరినైనా మోసం చేసినా.. లేదంటే మోసపోయినా భగవద్గీత చదవాలి. నీ చుట్టూ అందరూ ఉన్నా… లేదంటే జీవితంలో ఒంటరిగా ఉన్నా.. ఆరోగ్యంగా ఉన్నా.. అనారోగ్యంతో ఉన్నా భగవద్గీత చదవాల్సిందే. చాలా విద్యావంతుడవా… విద్యాహీనుడివా… పురుషుడివా… మహిళవా… దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా… దేవుడు లేడు అని అనుకుంటున్నావా… ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా… పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా… మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా… కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని ఉందా… ఈ సృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి అని ఉందా? కూడా భగవద్గీత చదవాల్సిందే. పుట్టక ముందు మనము ఎవరము అని తెలుసుకోవాలని ఉందా? చనిపోయిన తర్వాత మనము ఏమి అవుతాము అని తెలుసుకోవాలని ఉందా? నీలో కామం, క్రోధం, లోభం, మొహం, మధం, మాత్సర్యము వంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయా…? అన్నింటికీ సమాధానం కావాలంటే భగవద్గీతను పఠించాల్సిందేనని చెబుతారు.

Share this post with your friends
Exit mobile version